వంగూరు మండల అభివృద్ధికి రూ.70 కోట్లు

వంగూరు, వెలుగు: మండలంలో రూ. 70 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు జడ్పీటీసీ కేవీఎన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఎంపీడీవో ఆఫీస్​లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్  ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తుందన్నారు. కొండారెడ్డిపల్లి ఎక్స్ రోడ్  నుంచి పోల్కంపల్లి వరకు సెంట్రల్  లైటింగ్, సర్వారెడ్డిపల్లి నుంచి కొండారెడ్డిపల్లి వరకు ఫోర్ లేన్  రోడ్డు​ మంజూరైనట్లు చెప్పారు. మండలాన్ని సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే వంశీకృష్ణ సహకారంతో డెవలప్​ చేస్తామన్నారు. పండిత్​రావు, పాండురంగారెడ్డి, అల్వాల్ రెడ్డి, రంగారావు, కడారి వెంకటయ్య యాదవ్  పాల్గొన్నారు.