- పెట్రోలింగ్ చేస్తున్న సోల్జర్లపై
- మంచు జారి మీదపడ్డది
- అరుణాచల్ లో ఏడుగురు జవాన్లు గల్లంతు
న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్లోని అతి ఎత్తయిన కమెంగ్ ఏరియాలో ఆదివారం కొండపై నుంచి భారీ ఎత్తున మంచు జారి మీద పడటంతో ఏడుగురు సోల్జర్లు గల్లంతు అయ్యారు. సోల్జర్ల టీం పెట్రోలింగ్ చేస్తుండగా అవలాంచే సంభవించడంతో ప్రమాదం జరిగినట్లు సోమవారం ఆర్మీ అధికారులు చెప్పారు. గల్లంతయిన జవాన్ల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని తెలిపారు. ఇందుకోసం స్పెషలిస్ట్ టీంలను హెలికాప్టర్ ద్వారా సంఘటన స్థలానికి తరలించినట్లు చెప్పారు. సంఘటన జరిగిన ప్రాంతంలో కొన్నిరోజులుగా భారీగా మంచు కురుస్తుండటంతో అవలాంచేకు దారి తీసిందని పేర్కొన్నారు.
