పోలీసుల తనిఖీల్లోరూ.6.55 లక్షలు స్వాధీనం

వనపర్తి, వెలుగు: వనపర్తి జిల్లా లో అన్ని పోలీస్ స్టేషన్లో వాహనాలు తనిఖీలు నిర్వహించగా ఎలాంటి ఆధారాలు లేని నగదు రూ. 6,55,200  , 72 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ రక్షిత కృష్ణ మూర్తి తెలిపారు. మోడల్ కోడ్ అమలులో ఉందని, రూ.50వేల కంటే ఎక్కువ నగదు క్యారీ చేయొద్దని తెలిపారు. ఎక్కువ మొత్తంలో బంగారం, ఇతర వస్తువులను తీసుకెళ్లేవారు ఆధారాలను చూపాలని, లేకుంటే నగదు, బంగారం, ఆభరణాలు సీజ్ చేస్తామని  హెచ్చరించారు.