పెళ్లికి వయస్సుతో సంబంధం లేదని నిరూపించనున్నారు ప్రముఖ సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే. 65 ఏళ్ల వయస్సులో ఆయన రెండో పెళ్లికి సిద్ధపడుతున్నారు. కుల్‌భూషణ్ జాదవ్ ,వొడాఫోన్ కేసులతో పాటు ముఖేష్ అంబానీ, రతన్ టాటా గ్రూప్ సంస్థలకు హరీష్ సాల్వే శాశ్వత న్యాయవాదిగా ఉన్న సాల్వే లండన్‌కు చెందిన ప్రముఖ కళాకారిణి కరోలిన్ బ్రొస్సార్డ్‌ను పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ ప్రముఖ న్యాయవాది సాల్వే 1982లో మీనాక్షిని వివాహం చేసుకున్నారు. సాల్వే దంపతులకు ఇద్దరు కుమార్తెలు. 38 సంవత్సరాల వైవాహిక జీవితానికి ముగింపు పలికారు. చట్టబద్ధంగా కోర్ట్ నుంచి విడాకులు తీసుకున్నారు. సొలిసిటర్ జనరల్‌గా పదవీ కాలం ముగిసిన అనంతరం ఆయన లండన్‌లో నివసిస్తున్నారు. అక్కడే ఓ ఆర్ట్ ఎగ్జిబిషన్ సందర్భంగా కరోలీన్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం పెళ్లికి దారితీసింది. కాగా కరోలిన్ బ్రొస్సార్డ్. వయస్సు 56 సంవత్సరాలు. ఆమెకు ఇదివరకే వివాహమైంది. 18 సంవత్సరాల కుమార్తె ఉన్నారు. ఆమె కూడా డైవొర్సీ కావడంతో హరీష్ సాల్వేతో వివాహానికి అంగీకరించారు.
