64 ఏళ్ల వయసులో నీట్ ర్యాంక్ సాధించిన రిటైర్డ్ ఉద్యోగి

64 ఏళ్ల వయసులో నీట్ ర్యాంక్ సాధించిన రిటైర్డ్ ఉద్యోగి
ఒడిశాకు చెందిన జై కిశోర్ ప్రధాన్ 64 ఏళ్ల వయసులో నీట్ ర్యాంక్ సాధించారు. రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి అయిన జై కిషోర్ ప్రధాన్… ఒడిశాలోని బడ్గడ్ కు చెందినవారు. ఆయన విద్యార్థి దశలోనే MBBS చదవాలనుకున్నప్పటికీ అప్పటి పరిస్థితుల కారణంగా వీలుపడలేదు. తర్వాత బ్యాంక్ లో ఉద్యోగం సాధించి ఈ మధ్యే రిటైర్ అయ్యారు. తగినంత ఖాళీ దొరకడంతో ప్రిపేర్ అయి నీట్ ర్యాంక్ సాధించారు. MBBS ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ గా ఎన్ రోల్ కూడా అయ్యారు. MBBS పూర్తి చేసి ప్రజలకు సేవలందించడమే తన లక్ష్యం అంటున్నారు జై కిశోర్ ప్రధాన్. క్షమించండి.. నేను పార్టీ పెట్టడం లేదు