ఇంటర్ ప్రైవేటు కాలేజీల్లో 6.23 లక్షల అడ్మిషన్లు

  • సర్కారు కాలేజీల్లో 3.15 లక్షల అడ్మిషన్లు 

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని సర్కారు కాలేజీలతో పోలిస్తే ప్రైవేటు కాలేజీల్లో రెండింతల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ విద్యాసంవత్సరంలో ఇప్పటివరకూ 1,257 ప్రైవేటు కాలేజీలకు అనుమతి ఉండగా, వాటిలో 6,23,993 మంది చదువుతున్నట్టు ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఇంటర్ బోర్డు అధికారులను యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఫౌండర్ రాజేంద్ర పల్నాటి సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలను కోరగా

తాజాగా ఇంటర్ బోర్డు వాటిని ఆయనకు అందించింది. స్టేట్​లో సర్కారు, సర్కారు సెక్టార్ కాలేజీలు 1,771 ఉండగా, వాటిలో 3,15,809 మంది చదువుతున్నట్టు అధికారులు వెల్లడించారు. సర్కారు కాలేజీల్లో విద్యార్థులకు భరోసా కల్పిస్తూ, అడ్మిషన్లను మరింత పెంచుకోవాల్సిన అవసరం ఉందని పల్నాటి రాజేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.