కాంగ్రెస్​లో చేరిన బీఆర్ఎస్ నేతలు

రేవల్లి, వెలుగు : మండలంలోని చిర్కపల్లి గ్రామానికి చెందిన 62 మంది బీఆర్ఎస్  నేతలు సోమవారం గాంధీ భవన్​లో మాజీ జడ్పీటీసీ రాజేశ్వర్ రెడ్డి, మాజీ సర్పంచ్ భాస్కర రావు, ఎంపీటీసీ వల్లమ్మ, రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్​ పార్టీలో చేరారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి చిన్నారెడ్డి వారికి కాంగ్రెస్  కండువాలు

కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్​ పార్టీలో చేరడం గర్వంగా ఉందని, అభివృద్ధి కాంగ్రెస్  పార్టీతోనే సాధ్యమవుతుందనే నమ్మకంతో చేరామని తెలిపారు. పార్టీ ఆదేశాల మేరకు నడుచుకుంటామని చెప్పారు.