రెండో పెళ్లి కోసం స్తంభం ఎక్కిన 60 ఏళ్ల వ్యక్తి

రెండో పెళ్లి కోసం స్తంభం ఎక్కిన 60 ఏళ్ల వ్యక్తి

ధోల్‌‌పూర్: రెండో పెళ్లి కోసం ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదని 60 ఏళ్ల ఓ వ్యక్తి స్తంభం ఎక్కడం హాట్ టాపిక్‌‌గా మారింది. రాజస్థాన్‌‌లోని ధోల్‌పూర్‌కు 25 కిలో మీటర్ల దూరంలోని మధా భాను గ్రామానికి చెందిన సోబ్రాన్ సింగ్ రెండో పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అయితే అందుకు ఆయన పిల్లలు ఒప్పుకోలేదు. దీంతో వారిని ఎలాగైనా ఒప్పించేందుకు ఏకంగా 11కే ఎలక్ట్రిక్ పోల్ ఎక్కాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన స్తంభం ఎక్కగానే కుటుంబీకులు వారించారు. అయితే దిగడానికి తిరస్కరించిన సోబ్రాన్.. రెండో పెళ్లికి ఒప్పుకోకపోతే పక్కనే ఉన్న హైటెన్షన్ లైన్‌‌ను ముట్టుకుంటానని హెచ్చరించాడు. దీంతో అక్కడ చాలా మంది గుమిగూడారు. గంట తర్వాత గ్రామంలోని యువకులు కొందరు స్తంభం ఎక్కి సోబ్రాన్‌‌ను కిందకు దిగాల్సిందిగా కోరారు. దీంతో ఆయన కిందకు దిగారు.