పిడుగుపాటుకు  60 గొర్రెలు మృతి

వనపర్తి, వెలుగు : జిల్లాలోని పెద్దమందడి మండలం అల్వాల గ్రామంలో సోమవారం రాత్రి పిడుగు పాటుకు 60 గొర్రెలు చనిపోయాయి. గ్రామానికి చెందిన రమేశ్​, బుడ్డన్న తమ గొర్రెలను మేపి, ఊరవతల నిలిపి ఇండ్లకు వెళ్లారు. అర్ధరాత్రి దాటాక పెద్ద ఎత్తున ఉరుములు, మెరుపులతో వాన కురిసింది. మంగళవారం గొర్రెలు దగ్గరకు వెళ్లి చూడగా.. 60 గొర్రెలు చనిపోయి కనిపించాయి. విషయం తెలిసి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి గ్రామానికి వెళ్లి రైతులతో వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వ పరంగా నష్టపరిహారం అందేలా చూస్తానని అన్నారు. తహసీల్దార్​ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. రూ.6లక్షల దాకా ఆర్థిక నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు.