కుక్కల దాడిలో 60 గొర్రె పిల్లలు మృతి

చిన్నం బావి, వెలుగు: కుక్కల దాడిలో 60 గొర్రె పిల్లలు చనిపోయాయి. బాధితుల వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం మియాపురం గ్రామానికి చెందిన జింకల బీరయ్య, నడిపి అల్లోజీ, బిచ్చన్న, చిన్న బీరయ్యకు తమ గొర్రెలను మంగళవారం మేత కోసం అడవికి తీసుకెళ్లారు. 60 పిల్లలను ఇంటి దగ్గరే మంద వద్దనే వదిలేశారు.

ఇనుప కంచెతో వేసిన మందను కింద మట్టిని తవ్వి లోపలికి వచ్చిన కుక్కలు.. గొర్రె పిల్లలపై దాడి చేసి విచక్షణారహితంగా కొరికి చంపాయి. గొర్రె పిల్లల మృతితో తమకు రూ.3.60లక్షల నష్టం జరిగినట్లు గొర్రెల కాపరులు ఆవేదన వ్యక్తం చేశారు.