- లిస్టులో బ్రిటానియా, ఐటీసీ,అమూల్, నెస్లే, హల్దిరామ్ వంటి పెద్ద కంపెనీలు
- ఇవి కేవలం కేటగిరీ 1 కింద అనుమతి పొందిన కంపెనీలే..
- సక్సెస్ అవుతున్న పీఎల్‌ఐ స్కీమ్
న్యూఢిల్లీ: ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్‌లోకి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్‌మెంట్లను ఆకర్షిస్తోంది ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్‌ఐ) స్కీమ్. బ్రిటానియా, హల్దిరామ్, అమూల్ వంటి 60 బడా కంపెనీలు ఈ స్కీమ్ కింద ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అవుతున్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్‌లోని నాలుగు సెగ్మెంట్లలో ఇన్వెస్ట్ చేసేందుకు 60 కంపెనీలకు అనుమతులు ఇచ్చామని ప్రభుత్వం ప్రకటించింది. రెడీ టూ ఈట్ , పండ్లు, కూరగాయల ప్రాసెసింగ్, చేపలు వంటి మెరైన్ ఫుడ్స్, మోజరెల్లా (జున్ను వంటి మిల్క్ ప్రొడక్ట్స్) సెగ్మెంట్లలో ప్లాంట్లను పెట్టే కంపెనీలకు పీఎల్‌ఐ స్కీమ్ కింద రాయితీలను ఇస్తారు. బ్రిటానియా, అమూల్, ఐటీసీ, నెస్లే, టాటా , డాబర్ ఇండియా వంటి పెద్ద కంపెనీలు ఈ స్కీమ్ కింద అప్లికేషన్లు పెట్టుకోగా, వీటికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ‘పీఎల్‌ఐ కింద అప్లయ్ చేసుకున్న 60 కంపెనీలకు అనుమతులు ఇచ్చాం’ అని ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్ట్రీ ఓ స్టేట్‌మెంట్‌లో పేర్కొంది. కాగా, ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్‌కు పీఎల్‌ఐ స్కీమ్‌ను విస్తరిస్తున్నట్టు ఈ ఏడాది మార్చి 31 న ప్రభుత్వం ప్రకటించింది. రూ. 10,900 కోట్ల విలువైన రాయితీలను కంపెనీలకు వచ్చే ఆరేళ్లలో ఇస్తారు. దేశంలో వ్యవసాయ ఉత్తత్తులకు కొదవ లేదు. గ్లోబల్ ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలతో లోకల్ కంపెనీలు ధీటుగా పోటీపడేలా చేయడానికి ఈ స్కీమ్‌ను తీసుకొచ్చారు. రెడీ టూ ఈట్ లేదా రెడీ టూ కుక్, పండ్లు, కూరగాయలను ప్రాసెసింగ్ చేయడం, చేపలు వంటి మెరైన్ ప్రొడక్ట్‌లు, మోజరెల్లా చీజ్.. ఈ నాలుగు సెగ్మెంట్లలో ఇన్వెస్ట్ చేసే కంపెనీలకు పీఎల్‌ఐ స్కీమ్ కింద రాయితీలను ఇస్తారు.
కేవలం పెద్ద కంపెనీల లిస్టిది!
కేటగిరీ 1 కింద అప్లికేషన్ పెట్టుకున్న కంపెనీలకు అనుమతులు ఇచ్చారు. అంటే ఈ కేటగిరీ కింద అప్లయ్ చేసుకున్న కంపెనీలు తమ బ్రాండ్లను విదేశి మార్కెట్లలో అమ్మగలగాలి. పెద్ద కంపెనీలు మాత్రమే కేటగిరీ 1 కింద అప్లికేషన్ పెట్టుకుంటాయి. ప్రభుత్వ అనుమతులు పొందిన కంపెనీలు మొదటి రెండేళ్లలో (2021–22, 2022–23) ప్లాంట్, మెషినరీ కోసం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. రెడీ టూ ఈట్ ఫుడ్స్ సెగ్మెంట్‌లో బ్రిటానియా, హల్దిరామ్ శ్నాక్స్, అమూల్, పార్లే బిస్కట్స్, బికజి ఫుడ్స్ ఇంటర్నేషనల్, బికనర్‌వాలా ఫుడ్స్, బాలాజి వాఫర్స్, ఆన్మోల్ ఇండస్ట్రీస్, హిందుస్తాన్ యూనిలీవర్ కంపెనీలు అనుమతి పొందాయని ప్రభుత్వం ప్రకటించింది. పండ్లు, కూరగాయల ప్రాసెసింగ్ సెగ్మెంట్ కింద 30 అప్లికేషన్లకు అనుమతులు ఇచ్చామని ప్రభుత్వం చెబుతోంది. ఇందులో టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్, క్యాపిటల్ ఫుడ్స్, నెస్లే ఇండియా, డీఎస్ స్పైస్, డాబర్ ఇండియా, పార్లే ఆగ్రో, ఎంటీఆర్ ఫుడ్స్, మెకైన్ ఫుడ్స్ ఇండియా, టేస్టీ బైట్ ఈటబుల్స్ వంటి కంపెనీలు ఉన్నాయి. మోజరెల్లా చీజ్ కేటగిరీలో పరాగ్ మిల్క్ ఫుడ్స్, గుజరాత్ కో–ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్, సన్‌ఫ్రెష్ ఆగ్రో ఇండస్ట్రీస్, ఇందాపూర్ డెయిరీ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ కంపెనీలకు ప్రభుత్వం అనుమతిచ్చింది. మెరైన్ కేటగిరీ కింద 11 అప్లికేషన్లకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ కేటగిరీలో ఐటీసీ కూడా అప్లికేషన్ పెట్టుకుంది.
ప్రభుత్వానికి థ్యాంక్స్: నెస్లే
పీఎల్‌ఐ స్కీమ్ కింద ఇన్వెస్ట్ చేసేందుకు ప్రభుత్వం నుంచి అనుమతులు పొందామని ఎఫ్‌ఎంసీజీ కంపెనీ నెస్లే ప్రకటించింది. పండ్లు, కూరగాయల ప్రాసెసింగ్ సెగ్మెంట్‌లో ఈ అనుమతులు వచ్చాయని తెలిపింది. ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్‌లో పీఎల్‌ఐ కోసం ఈ ఏడాది జూన్‌లో అప్లికేషన్ పెట్టుకున్నామని తెలిపింది. రెడీ టూ ఈట్ లేదా రెడీ టూ కుక్, పండ్లు, కూరగాయల ప్రాసెసింగ్ సెగ్మెంట్ల కింద ఈ అప్లికేషన్ సబ్మిట్ చేశామని వివరించింది. ఇందులో పండ్లు, కూరగాయల ప్రాసెసింగ్ సెగ్మెంట్‌లో పీఎల్‌ఐ కింద ఇన్వెస్ట్ చేసేందుకు అనుమతులు వచ్చాయని నెస్లే ఓ స్టేట్‌మెంట్‌లో పేర్కొంది. ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్‌లో పీఎల్‌ఐ స్కీమ్ వలన రైతులకు ప్రయోజనం చేకూరుతుందని నమ్ముతున్నామని తెలిపింది.
