కర్నాటక నుంచి వస్తున్న లారీలు సీజ్‌‌‌‌ 

మాగనూర్, వెలుగు : ఎలాంటి పేపర్స్‌‌‌‌ లేకుండా కర్ణాటక నుంచి వడ్ల లోడ్‌‌‌‌తో వస్తున్న ఆరు లారీలను సీజ్ చేసినట్లు ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్‌‌‌‌ డీటీ గురురాజరావు చెప్పారు. నారాయణపేట జిల్లా కృష్ణ మండల పరిధిలోని కర్నాటక సరిహద్దు, 150 జాతీయ రహదారి పైనుంచి శనివారం అర్ధరాత్రి ఆరు లారీలు వడ్ల లోడ్‌‌‌‌తో వెళ్తున్నారు. చేగుంట చెక్‌‌‌‌పోస్ట్‌‌‌‌ వద్ద ఆఫీసర్లు లారీలను ఆపి తనిఖీ చేశారు.

ఎలాంటి పేపర్స్‌‌‌‌ లేకపోవడంతో వడ్ల లోడ్‌‌‌‌ లారీలను కృష్ణ పోలీస్‌‌‌‌స్టేషన్‌‌‌‌కు తరలించారు. ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్‌‌‌‌ డీటీ గురురాజరావు ఆదివారం లారీలను పరిశీలించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో వడ్లను సీజ్‌‌‌‌ చేశారు. తెలంగాణలో సన్నొడ్లకు మద్దతు ధరతో పాటు, రూ. 500 బోనస్‌‌‌‌ వస్తుండడంతో పక్క రాష్ట్రాలకు చెందిన దళారులు వడ్లను తీసుకొస్తున్నారని ఆయన తెలిపారు. అక్రమాలకు పాల్పడే వారిపై చర్యలు తప్పవని డీటీ గురురాజారావు హెచ్చరించారు.