ఆరోగ్యకరమైన. మెరిసే చర్మానికి విటమిన్ కె

ఆరోగ్యకరమైన. మెరిసే చర్మానికి విటమిన్ కె

ఆరోగ్యకరమైన. మెరిసే చర్మం కావాలంటే విటమిన్ (K)కె అధికంగా ఉండే ఆహారాలను ఆహారంలో చేర్చుకోవాలి.  చర్మం ఆరోగ్యంగా, మెరుస్తూ ఉండటానికి అనేక పోషకాలు అవసరం. అందుకు మితమైన పరిమాణంలో సరైన ఆహారాన్ని తీసుకోవడం చాలా అవసరం. ఆరోగ్యకరమైన చర్మం, జుట్టు కోసం విటమిన్ B ఎంతటి మేలు చేస్తుందో విటమిన్ K కూడా అంతే సహాయపడుతుంది. ఇది కొవ్వులో కరిగే విటమిన్. కె1, కె2  అనే రెండు రూపాలతో లభించే ఈ విటమిన్.. ఆరోగ్యకరమైన గుండె, ఎముకలకు చాలా దోహదపడుతుంది. ఇది చర్మ ఆరోగ్యానికి కూడా తోడ్పడుతుంది.

చర్మ ఆరోగ్యానికి విటమిన్ కె ఎందుకు ముఖ్యమైందంటే?

  •     విటమిన్ కె గాయాలు వేగంగా నయం చేయడంలో సహాయపడుతుంది.
  •     ఇది యాంటీఆక్సిడెంట్‌గా కూడా పనిచేస్తుంది కాబట్టి, చర్మాన్ని దీర్ఘకాలిక నష్టం నుండి కాపాడుతుంది.
  •     ఈ విటమిన్ చర్మం వాపు, ఎర్రబడడాన్ని తగ్గిస్తుంది.
  •     ఇది పొడి చర్మం, నల్లటి వలయాలను నివారించడంలో కూడా సహాయపడుతుంది.
  •     విటమిన్ K చర్మంపై కనిపించే వృద్ధాప్య లక్షణాలను కూడా నివారిస్తుంది.

విటమిన్ K అధికంగా ఉండే 6 ఆహారాలు :

1. బ్రోకలీ

విటమిన్ K1లో ఉండే ఫైలోక్వినోన్ సాధారణంగా ఆకుపచ్చ ఆకు కూరలలో ఉంటుంది. బ్రోకలీ చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది, ఎందుకంటే ఇందులో ఇతర ముఖ్యమైన పోషకాలు కూడా ఉన్నాయి. బ్రోకలీని తీసుకోవడం వల్ల విటమిన్లు ఎ, సి తో జింక్ కూడా లభిస్తుంది. బ్రోకలీలో వృద్ధాప్య నిరోధక లక్షణాలు ఉన్నాయి. ఇందులో ఉండే లూటీన్ కంటెంట్ ఆక్సీకరణ నష్టాన్ని నివారించడంలో సహాయపడుతుంది. ఇందులో సల్ఫోరాఫేన్ కూడా ఉంటుంది. ఇది మీ చర్మాన్ని సూర్యరశ్మి నుంచి రక్షిస్తుంది.

2. బచ్చలికూర (పాలక్)

ఈ ఆకు పచ్చని వెజ్జీని తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అరకప్పు వండిన బచ్చలికూరలో సుమారు 440 mcg విటమిన్ K ఉంటుంది. ఈ కూరగాయలలో విటమిన్ ఎ, బి, సి అలాగే ఫోలేట్ కూడా ఉన్నాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. స్పష్టమైన, మెరిసే, ఆరోగ్యకరమైన చర్మాన్ని పొందడానికి ఇవన్నీ చాలా అవసరం. బచ్చలికూర తినడం వల్ల చర్మం హైడ్రేట్‌గా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. UV నష్టం నుంచి కూడా కాపాడుతుంది.

3. దానిమ్మ

దానిమ్మపండులో విటమిన్ కెతో పాటు సి కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ పండులోని యాంటీఆక్సిడెంట్లు మంటను తగ్గించడంలో సహాయపడతాయి. చర్మం మొత్తానికి రక్షణను అందిస్తాయి. ఇది అకాల వృద్ధాప్యాన్ని నివారించడానికి కూడా సహాయపడుతుంది. దానిమ్మ గింజలు  లేదా రసాన్ని తరచుగా తీసుకుంటే చర్మ సంరక్షణను సహకరిస్తుంది.

4. కివి

కివీస్ లో విటమిన్ కె ఉంటుంది. ఇందులో విటమిన్లు సి, ఇ, లుటిన్, జియాక్సంథిన్, పాలీఫెనాల్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ చర్మ ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. ఈ పండు తినడం వల్ల కొల్లాజెన్ ఉత్పత్తిని సులభతరం చేస్తుంది. చర్మాన్ని డార్క్ స్పాట్స్, సన్ డ్యామేజ్ నుంచి కాపాడుతుంది. కివిలో  యాంటీకాన్సర్ ప్రభావాలను కలిగించే సమ్మేళనాలు కూడా ఉన్నాయి.

5. మూలికలు

తాజా పార్స్లీతో సహా మూలికలు, తులసి, థైమ్, ఒరేగానో , కొత్తిమీర, సేజ్ మొదలైన ఎండిన మూలికల్లో విటమిన్ K1 ఉంటుంది. వీటిని సలాడ్‌లు, గుడ్లు, స్నాక్స్, వాటితో కలిపి కూడా తీసుకోవచ్చు.

6. పాల ఉత్పత్తులు

విటమిన్ K2 లేదా మెనాక్వినోన్‌లు కొన్ని పులియబెట్టిన ఆహారాలు, జంతువుల్లో లభిస్తాయి. కొవ్వు పాలు, గుడ్లు, చీజ్ వంటి పాల ఉత్పత్తుల్లో విటమిన్ K2 కూడా ఉంటుంది. చర్మ ఆరోగ్యానికి దోహదపడే ఇతర విటమిన్లు, ఖనిజాలు, పోషకాలు కూడా వీటిలో పుష్కలంగా ఉంటాయి. అయినప్పటికీ, పాల ఉత్పత్తులు కొంతమందికి నచ్చవు, లేదా ఇతర సమస్యలను కలిగించవచ్చని భావిస్తారు. ఇందుకోసం కొన్ని పాల ఉత్పత్తులను వదులుకోవాల్సిన అవసరం రావచ్చు. అందువల్ల, ఇవి మీ ఆహారంలో మార్పులు చేసే ముందు నిపుణులను సంప్రదించడం మంచిది.

ఈ ఆహారాలు కాకుండా, చేపలు, గింజల్లోనూ విటమిన్ K ఉంటుంది. పైన్ గింజల్లోనూ విటమిన్ K పుష్కలంగా లభిస్తుంది.