ఏపీలో ఘోర ప్రమాదం.. ఆరుగురు మృతి..

ఏపీలో తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. కృష్ణా జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు కృత్తివెన్ను మండలం సీతనపల్లి వద్ద హైవేపై రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ లారీల్లో ఒకటి కృష్ణా జిల్లా బంటుమిల్లి వైపు వెళ్తుండగా మరొకటి పుదుచ్చేరి నుంచి భీమవరం వైపు వెళ్లే సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది.

ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందారు. మృతుల్లో లారీ డ్రైవర్లతో పాటు మరో నలుగురు ఉన్నారు. ఘటనాస్థలంలోనే ఐదుగురు మృతి చెందగా ఆస్పత్రికి తరలిస్తుండగా మరొకరు మృతిచెందారు. చనిపోయినవారిలో ఐదుగురిని పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లరేవు వాసులుగా గుర్తించారు. ప్రమాద సమయంలో కృష్ణా జిల్లా బంటుమిల్లి వైపు వెళ్తున్న లారీలో డ్రైవర్‌తో పాటు 10 మంది ప్రయాణికులున్నారు.మరొక లారీలో డ్రైవర్‌తో పాటు ఓ ప్రయాణికుడు ఉన్నట్లు తెలుస్తోంది.