త్వరలో హైదరాబాద్​లో 5జీ సేవలు

త్వరలో హైదరాబాద్​లో 5జీ సేవలు

న్యూఢిల్లీ: టెలికం కంపెనీలు వచ్చే ఏడాది హైదరాబాద్​తోపాటు గురుగ్రామ్, బెంగళూరు, కోల్‌‌‌‌‌‌‌‌‌‌కతా, ముంబై, చండీగఢ్, ఢిల్లీ, జామ్‌‌‌‌నగర్, అహ్మదాబాద్, చెన్నై, లక్నో, పూణే, గాంధీనగర్​లో 5జీ సేవలను మొదలుపెడతాయని డిపార్ట్​మెంట్​ ఆఫ్​ టెలికం (డాట్​) ప్రకటించింది. మేజర్​ టెల్కో ఆపరేటర్లు జియో, వీఐ, ఎయిర్​టెల్​ ఇదివరకే 5జీ ట్రయల్స్​ కూడా పూర్తి చేశాయి. ఈ టెక్నాలజీని డెవలప్ చేయడానికి బాంబే, ఢిల్లీ, హైదరాబాద్​, మద్రాస్​, కాన్పూర్​ ఐఐటీల సాయాన్ని డాట్ తీసుకుంది.