5జీ స్పెక్ట్రమ్​ వేలం బిడ్డింగ్

5జీ స్పెక్ట్రమ్​ వేలం బిడ్డింగ్

న్యూఢిల్లీ: టెలికం సేవలకు వాడే 5జీ స్పెక్ట్రమ్​ వేలం బిడ్డింగ్ ఐదో రోజు కూడా కొనసాగనుంది. ఇప్పటి వరకు 23  రౌండ్ల బిడ్డింగ్‌‌‌‌లలో రూ. 1,49,855 కోట్ల విలువైన బిడ్‌‌లు వచ్చాయి. ఉత్తరప్రదేశ్ ఈస్ట్ సర్కిల్‌‌లోని 1800 మెగాహెర్ట్జ్​బ్యాండ్‌‌లో స్పెక్ట్రమ్ కోసం జియో, ఎయిర్‌‌టెల్ బుధ, గురువారాల్లో తీవ్రంగా పోటీపడ్డాయి. వేలం సమయాలను పొడగించాల్సి వచ్చింది. బిలియనీర్ ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో, సునీల్ మిట్టల్ నేతృత్వంలోని భారతీ ఎయిర్‌‌టెల్, వొడాఫోన్ ఐడియా బిలియనీర్ గౌతమ్ అదానీ ఫ్లాగ్‌‌షిప్ అదానీ ఎంటర్‌‌ప్రైజెస్  5జీ స్పెక్ట్రమ్ కోసం రేసులో ఉన్నాయి. 

లాగ్-ఫ్రీ కనెక్టివిటీ, 4జీ కంటే 10 రెట్లు ఎక్కువ స్పీడ్​5జీ ప్రత్యేకతలు. వేలం మొదటిరోజు మంగళవారమే టెలికం కంపెనీలు ఈ స్పెక్ట్రమ్​కోసం రూ. 1.45 లక్షల కోట్లను కుమ్మరించాయి. బుధ గురువారాల్లో ఈ మొత్తాలు క్రమంగా పెరిగాయి. శుక్రవారం 17వ రౌండ్‌‌తో బిడ్డింగ్ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి. గురువారం వరకు 16 రౌండ్ల బిడ్డింగ్‌‌లో రూ.1,49,454 కోట్ల విలువైన బిడ్లు దాఖలయ్యాయి. కనీసం రూ. 4.3 లక్షల కోట్ల విలువైన మొత్తం 72 గిగాహెర్ట్జ్ రేడియో వేవ్స్​అమ్మకానికి ఉన్నాయి. స్పెక్ట్రమ్ కోసం వేలం వివిధ తక్కువ ఫ్రీక్వెన్సీ బ్యాండ్లలో (600 మెగాహెర్ట్జ్, 700 మెగాహెర్ట్జ్, 800 మెగాహెర్ట్జ్, 900 మెగాహెర్ట్జ్, 1800 మెగాహెర్ట్జ్, 2100 మెగాహెర్ట్జ్​, 2300 మెగాహెర్ట్జ్​, 2500 మెగాహెర్ట్జ్​), మధ్య (3300 మెగాహెర్ట్జ్​)  అధిక (26 గిగాహెర్ట్జ్​) జరుగుతోంది.