ఏపీలో 1800 దాటిని కరోనా పాజిటివ్‌ కేసులు

ఏపీలో 1800 దాటిని కరోనా పాజిటివ్‌ కేసులు
  • 24 గంటల్లో 56 కొత్తకేసులు
  •  విజయనగరంలో మూడు పాజిటివ్‌ కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1833కు చేరింది. గడిచిన 24 గంటల్లో 8,807 మందికి కరోనా టెస్టులు చేయగా.. 56 మందికి పాజిటివ్‌ వచ్చిందని అధికారులు గురువారం ప్రకటించారు. కరోనా బారిన పడ్డ 51 మంది కోలుకున్నారని అన్నారు. 38 మంది మరణించగా.. 1015 మంది హాస్పిటల్స్‌లో ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నారు. ఇప్పుడు వరకు ఒక్క కేసు కూడా లేని విజయనగరం జిల్లాలో మూడు కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో కేసులు 540కి చేరాయి. కాగా.. చిత్తూరు, తూర్పు గోదావరి, ప్రకాశం, శ్రీకాకుళం, వెస్ట్‌గోదావరిలో 24 గంటల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదని అధికారులు హల్త్‌ బులిటెన్‌లో చెప్పారు.

జిల్లాల వారీగా వివరాలు