పంజాగుట్ట, వెలుగు: క్రిస్మస్ సందర్భంగా బేగంపేటలోని కలనరీ అకాడమీ జూనియర్, సీనియర్చెఫ్లు 25 మంది కలిసి 550 కేజీల చాక్లెట్‌తో ప్రపంచంలోనే అతిపెద్ద చెస్ బోర్డును తయారు చేసి ఔరా అనిపించారు. వారం రోజులు శ్రమించి 16 అడుగుల పొడవు.. 16 అడుగుల వెడల్పుతో మొత్తం 256 అడుగుల విస్తీర్ణంలో భారీ చాక్లెట్చెస్బోర్డును రూపొందించారు. ఇటీవల వరల్డ్చెస్చాంపియన్గా నిలిచిన గుకేశ్‌కు ట్రిబ్యూట్ఇస్తూ దీనిని తయారు చేశారు.
ఇందుకోసం డార్క్ బ్లాక్, వైట్చాక్లెట్ను ఉపయోగించారు. ఇందులో కింగ్పీఎస్ల ఎత్తు 3 అడుగులు. సోమవారం భారీ చాక్లెట్‌ను ప్రదర్శనకు ఉంచగా, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్బాలకిష్టారెడ్డి, అండర్ 8 చెస్విభాగంలో వరల్డ్‌చాంపియన్‌గా నిలిచిన దివిత్రెడ్డి సోమవారం ప్రారంభించారు. అకాడమీ చైర్మన్సుధాకర్రావు, చెఫ్అక్షయ్కులకర్ణి పాల్గొన్నారు.