దీక్షాంత్​ పరేడ్.. ఫీట్స్ అదుర్స్..548 మంది కానిస్టేబుళ్లకు ట్రెయినింగ్​ పూర్తి 

  • 13వ బెటాలియన్​లో 548 మంది కానిస్టేబుళ్లకు ట్రెయినింగ్​ పూర్తి

మంచిర్యాల, వెలుగు : మంచిర్యాల జిల్లా గుడిపేటలోని 13వ బెటాలియన్​లో పోలీస్​ కానిస్టేబుళ్ల పాసింగ్​ అవుట్​ పరేడ్​ శుక్రవారం కన్నులపండువగా జరిగింది. తొమ్మిది నెలల ట్రెయినింగ్​ సక్సెస్​ఫుల్​గా పూర్తిచేసుకున్న 548 మందికి అధికారులు పోస్టింగ్​ ఆర్డర్లు అందజేశారు. వీరంతా రెండుమూడు రోజుల్లో డ్యూటీల్లో చేరనున్నారు. నిరుడు ఏప్రిల్​ 1న ప్రారంభమైన ట్రెయినింగ్​ కోసం మొత్తం 572 మంది బెటాలియన్​లో రిపోర్ట్​ చేశారు. ట్రెయినింగ్​లో ఉన్నప్పుడే ఇద్దరు ఫైర్ డిపార్ట్​మెంట్​కు​, ఇద్దరు డీఎస్సీ, 11 మంది గ్రూప్​4, ఒక్కరు జూనియర్​ లెక్చరర్​గా సెలక్ట్​ కాగా, 10 మంది వివిధ కారణాలతో ట్రెయినింగ్​ నుంచి వెళ్లిపోయారు.

Also Read :- కేంద్ర ఉద్యోగులపై సీబీఐ దర్యాప్తుకు రాష్ట్రాల అనుమతి అక్కర్లే

ట్రెయినింగ్​ పూర్తి చేసుకున్న వారిలో ఇంటర్​ 106, డిప్లొమా 9, డిగ్రీ 270, పీజీ 41, బీటెక్​ 70, ఎంటెక్​ 3, ఎంసీఏ, ఎంబీఏ 32, ఫార్మసీ 7, బీఈడీ, ఎంఈడీ 6, బీపీఈడీ ఒక్కరు, ఎల్​ఎల్​బీ ఒక్కరు ఉన్నారు. రంగారెడ్డి జిల్లా కొత్తూర్​ మండలం పెద్దగుట్ట తండాకు చెందిన నరేశ్​ ఓవరాల్​ చాంపియన్​గా​ నిలిచి పరేడ్​ కమాండర్​గా వ్యవహరించారుమంచిర్యాల కలెక్టర్​ కుమార్​ దీపక్​ చీఫ్​ గెస్ట్​గా హాజరుకాగా, అతిథులుగా అడిషనల్​ కలెక్టర్​ సబావత్​ మోతీలాల్​, డీసీపీ ఏ.భాస్కర్​,  బెటాలియన్​ కమాండెంట్​ పి.వెంకటరాములు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కానిస్టేబుళ్లతో పాటు వారి కుటుంబీకులు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కానిస్టేబుళ్లు సాహస విన్యాసాలతో ఆకట్టుకున్నారు.