సంగారెడ్డిలో 500 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత

సంగారెడ్డి జిల్లాలో జోరుగా రేషన్ బియ్యం రీసైక్లింగ్ వ్యాపారం జరుగుతోంది. బీడీఎల్ భానూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పాశమైలారం పారిశ్రామిక వాడలో భారీగా రేషన్ బియ్యం పట్టుబడ్డాయి. కోటి రూపాయల విలువ చేసే 500 టన్నుల రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు సివిల్ సప్లయ్ అధికారులు. 

ఇతర ప్రాంతాలనుంచి సేకరించిన రేషన్ బియ్యాన్ని గుట్టు చప్పుడు కాకుండా రీసైక్లింగ్ చేసి అధిక ధరలకు  రైస్ మిల్లర్లు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అక్రమ దందా నిర్వహిస్తున్న నిజామాబాద్ జిల్లా బాన్సువాడకు చెందిన ప్రభాకర్ రెడ్డి, రవిలపై కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతం రవి పోలీసుల అదుపులో ఉండగా.. ప్రభాకర్ రెడ్డి పరారీలో ఉన్నట్లు ఎస్పీ రూపేష్ తెలిపారు.