పుణెలో భారీ అగ్నిప్రమాదం

పుణెలో భారీ అగ్నిప్రమాదం

మహారాష్ట్రలోని పుణెలో  భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఎంజీ రోడ్‌లోని ఫ్యాషన్‌ స్ట్రీట్‌లో శుక్రవారం అర్ధ రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో.. 500లకు పైగా షాపులు దగ్ధమయ్యాయి. ఒక్కసారిగా మంటలు అంటుకుని దట్టమైన పొగలు, మంటలు ఎగిసిపడ్డాయి. విషయం తెలుసుకున్నఅగ్నిమాపక సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకుంది. 16 ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ అగ్ని ప్రమాద ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. రాత్రి సమయం కావడంతో అక్కడ జనం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.