ఓయోతో 500 హోటల్స్ కటీఫ్…

ఓయోతో 500 హోటల్స్ కటీఫ్…

న్యూఢిల్లీ: హాస్పిటాలిటీ చెయిన్ ఓయోతో హోటల్స్ తమ సంబంధాలను తెంచుకుంటున్నాయి. ఏప్రిల్ నుంచి వంద నగరాల్లో సుమారు 500 హోటల్స్‌‌… ఓయో హోటల్స్ అండ్ హోమ్స్‌‌కు కటీఫ్​ చెప్పినట్టు తెలిసింది. ఓయోకి, హోటల్స్‌‌కి మధ్య విభేదాలు రావడంతో ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

కాంట్రాక్ట్ ఉల్లంఘనలు, మినిమమ్ గ్యారెంటీ అమౌంట్‌‌లు, ఆర్బిటరీ కమిషన్ రేటు ఛార్జీలు, లీగల్ నోటీసులు వంటి వాటిపై ఓయోపై అంతకుముందు చాలా హోటల్స్‌‌ ఫిర్యాదు చేశాయి. చెల్లింపు చేయకపోవడంతో పాటు ఇతర కారణాలతో చిన్న హోటల్స్ ఓయోకి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నాయి. అంతేకాక కాంట్రాక్ట్‌‌లను విరమించుకుంటున్నాయని ఫెడరేషన్ ఆఫ్ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా హానరరీ సెక్రటరీ ప్రదీప్ శెట్టి చెప్పారు.

ఏప్రిల్ నుంచి సుమారు 500 నుంచి 700 హోటల్స్‌‌ ఓయో నుంచి ఎగ్జిట్ అయినట్టు అంచనావేస్తున్నట్టు తెలిపారు. ఈ విషయంపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) వద్ద ఫిర్యాదు కూడా దాఖలు చేశామని, ప్రస్తుతం ఈ విషయం విచారణలో ఉందని పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలను ఓయో కొట్టివేస్తోంది. మరోవైపు ఓయో ద్వారా హోటల్స్ బుకింగ్స్‌‌ కావడం లేదని చాలా మంది కస్టమర్లు ఫిర్యాదు చేస్తున్నారు.