కాంగ్రెస్ లో చేరిన.. 500 మంది కార్యకర్తలు

ఊట్కూరు, వెలుగు : మండలకేంద్రానికి చెందిన బీఆర్ఎస్​ నాయకులు సూర్య ప్రకాశ్​రెడ్డి, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులతో పాటు 500 మంది కార్యకర్తలు బుధవారం మక్తల్  ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి సమక్షంలో కాంగ్రెస్  పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్​ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాహుల్ ను ప్రధాని చేసేంత వరకు నాయకులు

కార్యకర్తలు పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యత కల్పిస్తామని తెలిపారు. బాలకృష్ణారెడ్డి, గోపాల్ రెడ్డి, విగ్నేశ్వర్ రెడ్డి, కొక్కు లింగం, మాజీ ఎంపీపీ మణెమ్మ, కోళ్ల వెంకటేశ్​ పాల్గొన్నారు.