అరే వెధవా : 8 ఏళ్ల పాపపై.. 50 ఏళ్ల వ్యక్తి లైంగిక దాడి

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో దారుణం చోటు చేసుకుంది.. 8ఏళ్ళ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని పెత్తుల్లా గ్రామంలో వెలుగులోకి వచ్చింది ఈ దారుణం. బోడ నరసింహ అనే 50ఏళ్ళ వ్యక్తి 8ఏళ్ళ బాలికకు చాక్లెట్ ఆశ చూపి లైంగికదాడికి పాల్పడ్డారు.పాప కేకలు వేయటంతో అక్కడి నుండి పరారయ్యాడు నిందితుడు. 

విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.తల్లిదండ్రుల నుండి ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు.వైద్య పరీక్షల కోసం బాలికను ఆసుపత్రికి తరలించారు.పోలీస్ స్టేషన్ ముందు బాలిక బంధువులు, నాయి బ్రాహ్మణ సంఘం నేతలు ఆందోళనకు దిగారు.నిందితులు కఠినంగా శిక్షించాలని కోరారు.