హైదరాబాద్: హవాయి చెప్పల్ సే హవాయి సఫర్ అనే నినాదంతో భారత విమానయాన మంత్రిత్వ శాఖ పనిచేస్తుందని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. వచ్చే 5 ఏళ్లలో దేశవ్యాప్తంగా 50 కొత్త విమానాశ్రయాలు నిర్మించడమే మా లక్ష్యమని స్పష్టం చేశారు. బుధవారం (డిసెంబర్ 11) శంషాబాద్‌లో ఆయన మాట్లాడుతూ.. - ఎయిర్ పోర్ట్ ప్రిడిక్టివ్ ఆపరేషన్ సెంటర్ ప్రారంభించడం భవిష్యత్తుకు ఒక మైలు రాయి అని అభివర్ణించారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో విమానయాన మంత్రిత్వ శాఖ వేగంగా పురోగతి, అభివృద్ధి చెందుతోందని.. దేశంలోని ప్రతీ ఎయిర్ పోర్ట్‌ని అధునాతనంగా తీర్చిదిద్దుతున్నామన్నారు.
ALSO READ | నిధుల కోసం డివిజన్ కోరొద్దు: కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్
ప్రపంచం మొత్తం ఇండియన్ ఎయిర్ పోర్ట్ వైపు చూసేలా చేస్తామని చెప్పారు. ఏటేటా విమానాల్లో ప్రయాణిచించే వాళ్ళు పెరుగుతూనే ఉన్నారన్నారు. ప్రయాణికులు మన దేవుళ్లని.. వాళ్ళ టైం వేస్ట్ చేయకూడదని ఎయిర్ పోర్టు సిబ్బందికి సూచించారు. చెక్ ఇన్, చెక్ అవుట్ వంటివి తక్కువటైంలోనే చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. వరంగల్, భోగపురం ఎయిర్ పోర్ట్‌లను పూర్తి చేయాల్సి ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని భోగపురం విమానాశ్రయం 2026 జూన్ వరకు పూర్తి అవుతుందని వెల్లడించారు. ప్రతి ఒక్క భారతీయుడు సులభంగా ప్రయాణం చేయడమే లక్ష్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.