Good Health : క్యారెట్ సూపర్ ఫుడ్ ఎందుకు అయ్యింది.. క్యారెట్ ఎందుకు తినాలంటే..!

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు..ఆరోగ్యాన్ని కాపాడుకుంటేనే ఏదైనా చేయగలం.. ఆరోగ్యంగా ఉంటేనే చేసే ప్రతి పనిలో విజయాన్ని సాధించగలం. అటువంటి ఆరోగ్యంపట్ల శ్రద్ధ చూపకపోతే చాలా అనర్థాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. 

ప్రస్తుతం బిజీ లైఫ్  షెడ్యూల్,తీసుకుంటున్న జంక్ ఫుడ్స్ తో  ఆరోగ్యంపై ప్రభావం పడుతున్న క్రమంలో చాలామంది ఆరోగ్యంపై అవగాహన పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో రోజూ వ్యాయామం  చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం ఎంచుకొని తినడం వంటి శ్రద్ధ పెడుతున్నారు. మంచి ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ వంటి ఆరోగ్యాన్ని పెంచే ఆహార పదార్థాల వైపు మొగ్గుచూపుతున్నారు. ఆరోగ్యాన్ని  కాపాడటంలో, ఆరోగ్యాన్ని మెరుగుపర్చేందుకు క్యారెట్ అధిక పోషకాలున్న సూపర్ ఫుడ్.. 

క్యారెట్లలో పోషకాలుపుష్కలంగా ఉంటాయి. ఆరోగ్యకరమైన ప్రయోజనాలున్న క్రంచీ స్నాక్స్. క్యారెట్లలో ఎక్కువ నీరు, పిండి పదార్థాలు, చక్కెరలు అధికంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి ఉపయోగపడే ఫైబర్ ను అందిస్తాయి. క్యారెట్ల తినడం ద్వారా షుగర్ కంట్రోల్ వంటి ఆరోగ్య కరమైన బెనిఫిట్ ఉంటాయి. 

క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించే.. 

క్యారెట్ లో కెరోటినాయిడ్స్, ఫైటోకెమికల్స్ పుష్కలంగా ఉంటాయి.  ఇవి క్యాన్సర్ నిరోధకాలుగా పనిచేస్తాయి. రోజూ తినే  ఆహారంలో క్యారెట్లను చేర్చుకోవడం ద్వారా ప్రోస్టేట్ , పెద్ద ప్రేగు, కడుపు, రొమ్ము , ఊపిరితిత్తుల క్యాన్సర్లతో సహా అన్ని రకాల క్యాన్సర్లు రాకుండా అడ్డుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 

ALSO READ | ఆధ్యాత్మికం : మౌనాన్ని మించిన మంచి లేదు.. 3 రకాలుగా మౌనం.. రమణ మహర్షి చెప్పిన సూక్తి ఇదే..!

విటమిన్లు, ఖనిజాలు పుష్కలం.. 

క్యారెట్లలో విటమిన్ ఏ, కె1, బి6, బయోటిన్ వంటి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. క్యారెట్లతో పొటాషియం ఖనిజాలను కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవి దృష్టి, జీవక్రియను మెరుగు పరుస్తాయి. 

బరువు తగ్గొచ్చు.. 

క్యారెట్లు తక్కువ క్యాలరీలను కలిగి ఉంటాయి. తక్కువ కాలరీలతో బరువుతు తగ్గవచ్చు. మనం నిత్యం తినే ఆహారంలో క్యారెట్లను చేర్చుకోవడం ద్వారా బరువును తగ్గించుకోవచ్చు. 

కంటికి ఆరోగ్యం..   

విటమిన్ ఎ లోపం వల్ల రేచీకటి అంటే రాత్రిళ్లు కళ్లు కనబడకపోవడం వంటి దృష్టి లోపం కలగవచ్చు. క్యారెట్లలో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. క్యారెట్లను మీ రోజుతీసుకునే ఆహారంలో చేర్చుకోవడం ద్వారా కంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు.