ఎండకు తల్లడిల్లిన ఢిల్లీ.. 49.2 డిగ్రీలు

ఎండకు తల్లడిల్లిన ఢిల్లీ.. 49.2 డిగ్రీలు

దేశ రాజధాని ఢిల్లీ ఎండలకు తల్లడిల్లుతోంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మాడు పగులుతుందా అనుకొనేలా ఎండలు ఉండడంతో ప్రజలు ఇంటికే పరిమితమవుతున్నారు. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో తీవ్రమైన వేడిగాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. మే 15వ తేదీ ఆదివారం అత్యధికంగా 49.2 డిగ్రీల టెంపరేచర్ నమోదైందని తెలిపారు. ఈమేరకు ట్వీట్ చేసింది. Mungeshpurలో 49.2, Najafgarh 49.1, Sports Complex 48.4, Gurgaon 48.1, Jafarpur 47.5, Pitamupura 47.3, Ridge 47.2, NCMRWF (Noida) 47.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. 

గత కొద్ది రోజులుగా ఢిల్లీలో ఇలాంటి వాతావరణమే కనిపిస్తోంది. భానుడి భగభగలతో నగరం ఉక్కిరిబిక్కిరవుతోంది. ఆదివారం కోసం ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వచ్చే వారం ఎండల నుంచి కొంత ఉపశమనం లభించే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. వచ్చే వారం మబ్బులతో ఆకాశం, చిరు జల్లులు పడే అవకాశం ఉందని వెల్లడిస్తోంది. ఇక ఎండల నుంచి తట్టుకోవడానికి ప్రజలు ఇతర మార్గాల వైపు చూస్తున్నారు. మండుతున్న ఎండలతో విద్యుత్ వినియోగం భారీగా పెరిగిపోతోంది. 

మరిన్ని వార్తల కోసం :

‘సైకిల్’కు మళ్లీ పెరుగుతున్న క్రేజ్  

నటి కరాటే కల్యాణి ఇంటికి ఛైల్డ్ వెల్ఫేర్ అధికారులు.. ఎందుకు ? 

థామస్ కప్ భారత్ కైవసం