ఏపీలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో ఆ రాష్ట్రంలో కొత్తగా 9544 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,34,940కు చేరింది. అలాగే రాష్ట్రంలో కొత్తగా 91 మంది వైరస్ కారణంగా మృతి చెందటంతో మొత్తం మృతుల సంఖ్య 3092కు చేరింది. అటు గడిచిన 24 గంటల్లో 8,827 మంది కరోనాను జయించగా… మొత్తం 244045 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
జిల్లాల వారీగా నమోదైన కేసులు… తూర్పుగోదావరి జిల్లాలో 1312, పశ్చిమ గోదావరిలో 1131, చిత్తూరులో 1103, కర్నూలులో 919 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అటు అనంతపురంలో 704, గుంటూరులో 358, కడపలో 343, కృష్ణాలో 265, నెల్లూరులో 761, ప్రకాశంలో 797, శ్రీకాకుళంలో 571, విశాఖపట్నం 738, విజయనగరంలో 542 కేసులు వచ్చాయి. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 2461, ఇతర దేశాల నుంచి వచ్చిన వారిలో 434 కేసులు నమోదయ్యాయి.

