కొనసాగుతున్న కృష్ణమ్మ పరవళ్లు... జూరాలలో - 45 గేట్లు, సాగర్‌‌‌‌లో 26 గేట్లు ఓపెన్‌

‌‌‌గద్వాల, వెలుగు : కృష్ణా నదికి ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్‌‌‌‌తో పాటు మహారాష్ట్రలోని భీమా నుంచి జూరాలకు వరద వస్తోంది. దీంతో జూరాల వద్ద 45 గేట్లను ఓపెన్‌‌‌‌ చేసి నీటిని కిందికి వదులుతున్నారు. భీమా నుంచి1.50 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండగా, నారాయణపూర్‌‌‌‌ నుంచి 1.78 లక్షల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. జూరాల వద్ద 4.438 టీఎంసీల నీటిని నిల్వ ఉంచుకొని 3,28,550 క్యూసెక్కులను వదులుతున్నారు. 

సాగర్‌‌‌‌కు 3 లక్షల క్యూసెక్కుల ఇన్‌‌‌‌ఫ్లో

హాలియా, వెలుగు : నాగార్జునసాగర్‌‌‌‌ రిజర్వాయర్‌‌‌‌కు ఎగువ నుంచి భారీ ఇన్‌‌‌‌ఫ్లో వస్తోంది. 3,09,003  క్యూసెక్కుల వరద రిజర్వాయర్‌‌‌‌లోకి వస్తుండడంతో సాగర్‌‌‌‌ 26 గేట్లను ఎత్తి 2,62,090 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్‌‌‌‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా శనివారం సాయంత్రానికి 588.90 అడుగుల నీరు నిల్వ ఉంది. సాగర్‌‌‌‌ నుంచి కుడి కాల్వకు 6,979 క్యూసెక్కులు, ఎడమకాల్వకు 7,937, విద్యుత్‌‌‌‌ ఉత్పత్తికి 29,597, ఎస్‌‌‌‌ఎల్‌‌‌‌బీసీకి 1,800, వరద కాల్వకు 600 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు.