పాలమూరు జిల్లా దవాఖానలో ఒకే రోజు 41 కాన్పులు

మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ కలెక్టరేట్, వెలుగు : పాలమూరు జిల్లా ప్రభుత్వ దవాఖానలో ఒకేరోజు 41 డెలివరీలు చేసినట్టు సూపరింటెండెంట్ సంపత్ కుమార్ సింగ్ తెలిపారు. సోమవారం వివరాలు వెల్లడించారు. ఈ నెల19న అధిక సంఖ్యలో గర్భిణులు డెలివరీ కోసం ఆస్పత్రికి వచ్చారన్నారు. గైనకాలజీ విభాగం డాక్టర్లు అన్ని ఏర్పాట్లు చేసి అందరికీ డెలివరీ చేశారన్నారు.

ఇందులో 10 మందికి నార్మల్‌‌‌‌, 31 మందికి సిజేరియన్లు జరిగాయని   వివరించారు. తల్లులతో పాటు పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారన్నారు. గైనకాలజీ విభాగం డాక్టర్ సంగీత, డాక్టర్లు లక్ష్మి పద్మ ప్రియ, ఆశాజ్యోతి,  స్ఫూర్తి, సరిత,  అర్చన, సోఫియా, రూహి, షహనాజ్, సురేఖను అభినందించారు.