రాజ్యసభకు 41 మంది ఏకగ్రీవమయ్యారు. బీజేపీ పార్టీ నుంచి 14 మంది పెద్దల సభలో అడుగుపెట్టనున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి నలుగురు, ఏపీ రాష్ట్రం నుంచి నలుగురు (వైసీపీ) రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పార్టీ సంఖ్య 9కి పెరిగింది. ఇతర ప్రాంతీయ పార్టీల నుంచి పలువురు రాజ్యసభకు ఎన్నికయిన వారిలో ఉన్నారు. యూపీలో 11 మంది, తమిళనాడులో ఆరుగురు, బీహార్ లో ఐదుగురు, ఏపీలో నలుగురు, మధ్యప్రదేశ్, ఒడిశాలో ముగ్గురు చొప్పున, చత్తీస్ గఢ్, పంజాబ్, తెలంగాణ, జార్ఖండ్ లలో ఇద్దరు చొప్పున, ఉత్తరాఖండ్ లో ఒక అభ్యర్థి పోటీ లేకుండా ఎన్నికయ్యారు. మొత్తం రాజ్యసభలో 57 ఖాళీలు ఏర్పడిన సంగతి తెలిసిందే. జూన్ 10వ తేదీన ఎన్నికలు జరుగనున్నాయి. పలు పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి.
దీంతో ఆ అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. నిన్నటితో గడువు ముగిసింది. అందులో 41 మంది అభ్యర్థులు ఎలాంటి పోటీ లేకుండానే ఎన్నికయ్యారు. మిగిలిన 16 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 6 సీట్లకు ఎన్నికలు జరగనుండగా.. రాజస్థాన్ లో 4, కర్ణాటకలో 4, హర్యానాలో 2 సీట్లకు ఎన్నికలు నిర్వహించనున్నారు. హర్యానా, రాజస్థాన్, కర్ణాటక మరియు మహారాష్ట్రలలో అభ్యర్థులు ఎవరూ పోటీ నుంచి తప్పుకోలేదు. దీంతో ఆ రాష్ట్రాల్లో తీవ్రమైన పోటీ నెలకొంది.
మరిన్ని వార్తల కోసం : -
దేశంలో ప్రతిపక్షం బలంగా ఉండాలన్న మోడీ
అమెరికా ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోంది
