ఎల్లికల్లులో 400 ఏళ్ల నాటి ఆంజనేయ విగ్రహం

  • పురావస్తు పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి

కల్వకుర్తి, వెలుగు: నాగర్ కర్నూల్​ జిల్లా కల్వకుర్తి మండలం ఎల్లికల్  గ్రామంలోని శివాలయంలో 400 ఏండ్ల నాటి అరుదైన అతి చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం ఉందని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్  ఇండియా సీఈవో ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. సీఎం సోదరుడు ఎనుముల జగదీశ్వర్ రెడ్డి సమాచారం మేరకు ఆయన బుధవారం ఎల్లికల్  గ్రామ శివారులోని శిథిలమైన శివాలయాన్ని సందర్శించారు. 

అందులో ఉన్న భిన్నమైన 3 నంది విగ్రహాలు, గ్రామంలోని శివాలయం ధ్వజ స్తంభం పీఠంపై సూక్ష్మ ఆంజనేయస్వామి, గణేశ్​ విగ్రహాలను పరిశీలించారు. విజయనగర రాజుల కాలానికి చెందిన 400 ఏండ్ల నాటి ఈ అరుదైన చిన్న శిల్పాలను కాపాడుకోవాలని సూచించారు. మామిడాల ముత్యాల రెడ్డి, బడే సాయికిరణ్ రెడ్డి 
పాల్గొన్నారు.