నారదా కుంభకోణం కేసులో అరెస్టైన నలుగురు బెంగాల్ నేతలకు కోల్‌కతా హైకోర్టు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. ఈ కేసులో ఆరోపణలు మోపబడిన వారిలో ఇద్దరు ఎమ్మెల్యేలు సుబ్రతా ముఖర్జీ, ఫిర్హాద్ హకీమ్ ప్రస్తుతం తృణమూల్ నేతృత్వంలోని మమత బెనర్జీ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు. ఒకరు తృణమూల్ ఎమ్మెల్యే మదన్ మిత్రా..మరొకరు మాజీ తృణమూల్ నేత సోవన్ ముఖర్జీ. ప్రస్తుతం బెంగాల్‌లో లాక్‌డౌన్ అమలును ప్రస్తావిస్తూ..కొన్ని షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. ఈ కుంభకోణం కేసులో ఎటువంటి ఇంటర్వ్యూలు ఇవ్వరాదని, దర్యాప్తులో జోక్యం చేసుకోరాదని తెలిపింది. రూ. 2 లక్షల వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది.
కోర్టు నిందితులకు బెయిల్ ఇచ్చినట్లయితే...దర్యాప్తును ప్రభావితం చేయగల సత్తా ఉందని..దీంతో తప్పుడు సందేశం ఇచ్చినట్లు అవుతోందని..మధ్యంతర బెయిల్ ఇవ్వరాదని సీబీఐ తరుపు సొలిసీటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు. వాదనలు విన్న కోర్టు ..నలుగురికి మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది.
