నాగర్ కర్నూల్ లో విషాదం.. ప్రహరీ గోడ కూలి నలుగురు మృతి

నాగర్ కర్నూల్ జిల్లా తాడూర్ మండలంలో విషాదం చోటుచేసుకుంది.  మే 26వ తేదీ ఆదివారం సాయంత్రం  రెండు గంటల పాటు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులకు ఇంద్రకల్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న కోళ్ల ఫారం ప్రహరీ గోడ కుప్పకూలి నలుగురు కార్మికులు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 

ఈ ప్రమాదంలో మృతి చెందినవారిలో యజమాని మల్లేష్‌, పదేళ్ల చిన్నారితో పాటు మరో ఇద్దరు కూలీలు చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్ప్రత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.