బిగ్ బ్రేకింగ్: తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం.

రోడ్డు ప్రమాదాల్ని నివారించేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొందరి నిర్లక్ష్యం కారణంగా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కాగా ఈరోజు(సెప్టెంబర్ 12, 2024) లారీ - కారు-బైక్ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృతి చెందిన ఘటన చంద్రగిరి మండలంలో చోటు చేసుకుంది.

పూర్తీ వివరాల్లోకి వెళితే కలకడ నుండి చెన్నైకి టమోటో  లోడ్ తో వెళుతున్న  కంటైనర్‌ లారీ అదుపుతప్పి భాకరాపేట పరిసర ప్రాంతంలోని కనుమ రహదారిలో అటుగా వస్తున్న కారు మరియు బైక్ ని డీ కొట్టి వాటిపైకి దూసుకెళ్లింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. 

స్థానికుల నుంచి సమాచారం అందుకుని పోలీసులు వెంటనే సంఘటనా స్థలికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఈ ప్రమాదానికి అతివేగమేనని పోలీసులు గుర్తించారు. అలాగే సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.