ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్ గఢ్ నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. మావోయిస్టులకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు, జిల్లా రిజర్వ్ గార్డ్ (డీఆర్‌జీ) హెడ్ కానిస్టేబుల్ సన్ను కారం మృతిచెందారు. 

నారాయణపూర్, దంతేవాడ జిల్లా సరిహద్దు వెంబడి దక్షిణ అబుజ్ మాద్ లోని అటవీప్రాంతంలో శనివారం సాయంత్రం జరిగిన ఎన్ కౌంటర్ లో భద్రతా సిబ్బంది, మావోయిస్టు ఏరివేత ఆపరేషన్ లో భాగంగా కూంబింగ్ నిర్వహిస్తుండగా ఎదురు కాల్పులు  జరిగాయి. శనివారం అర్థరాత్రి ఎదురు కాల్పులు ఆగిన తర్వాత ఘటనా స్థలంలో నలుగురు మావోయిస్టుల మృతదేహాలు, ఏకే 47 రైఫిల్, సెల్ఫ్ లోడింగ్ రైఫిల్ (SLR) సహా ఆటోమేటిక్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.

గతేడాది కేంద్ర హోమంత్రి అమిత్ షా  మావోయిస్టులు లేకుండా చేస్తామని ప్రతిజ్ణ చేశారు.మార్చి 2026 నాటికి మావోయిస్టులేకుండా చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించిన తర్వాత మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. అందులో భాగంగా ఛత్తీస్ గఢ్ అడవుల్లో ఆపరేషన్ కొనసాగుతోంది. 2024లో ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా దళాలు నిర్వహించిన ఆపరేషన్ లో 200 మంది మావోయిస్టులు హతమయ్యారు.