నదిలో పడ్డ వెహికల్​.. నలుగురు మృతి.. జమ్మూకాశ్మీర్లో ప్రమాదం

కిష్టవార్: వాహనం అదుపు తప్పి నదిలో పడిపోవడంతో నలుగురు చనిపోయారు. జమ్మూకాశ్మీర్​లోని కిష్టావర్  జిల్లా పద్దర్  ప్రాంతంలో ఆదివారం ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్​తో పాటు మరో వ్యక్తి గల్లంతయ్యాడు. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. గల్లంతైన ఇద్దరి కోసం వెతుకుతున్నారు. ప్రమాదంపై ఉధంపుర్  ఎంపీ, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్  విచారం వ్యక్తంచేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు ‘ఎక్స్’లో ఆయన ప్రగాఢ సంతాపం తెలిపారు. కిష్టవార్ డిప్యూటీ కమిషనర్ రాజేష్​ కుమార్​తో మంత్రి మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.