తిరుపతి ఫ్లై ఓవర్పై రెండు కార్లు ఢీ.. నలుగురికి తీవ్ర గాయాలు

ఆంధ్రప్రదేశ్ తిరుపతి శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ పై రోడ్డు ప్రమాదం జరిగింది. పట్టణంలోని ఫ్లై ఓవర్ పై ఎదురెదురుగా వేగంగా దూసుకొచ్చిన రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కార్లలో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.  సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం వెంటనే...స్థానిక రుయా హాస్పిటల్ కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ప్రమాదానికి అతివేగమే కారణమని తెలుస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

గతేడాది కూడా శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ పై రోడ్డు ప్రమాదాలు జరిగాయి. తరుచూ ప్రమాదాలు చోటుచేసుకుంటుండంతో వాహనాదారులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రమాదాలు జరగకుండా ట్రాఫిక్ పోలీస్ అధికారులు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.