శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని కిష్త్‌వర్‌లో ఆకస్మిక వరదలు వచ్చాయి. హోన్‌జార్ గ్రామంలో హఠాత్తుగా వచ్చిన వరదలకు తీవ్ర నష్టం జరిగింది. వరదల ధాటికి పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. దాదాపు 30 మందికి పైగా గల్లంతయ్యారు. వీరి ఆచూకీ ఇంకా తెలియరాలేదు. ‘శిథిలాల నుంచి ముగ్గురి శవాలను స్వాధీనం చేసుకున్నాం. హోన్‌జార్ గ్రామంలో 8 నుంచి 9 ఇళ్లు ధ్వంసమయ్యాయి’ అని కిష్త్‌వర్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ అశోక్ కుమార్ శర్మ తెలిపారు. ఆర్మీ, పోలీసులు కలసి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారని చెప్పారు.
