భారత ఆర్మీలో 39 మంది మహిళా సైనిక ఉద్యోగులు శాశ్వత కమిషన్‌ను పొందారు. సుప్రీంకోర్టు న్యాయ పోరాటంలో గెలిచిన తర్వాత వీరికి శాశ్వత కమిషన్‌లో చోటు లభించింది. కొత్త సేవలకు చెందిన హోదాను ఏడు పని దినాల్లో మంజూరు చేయాలన్న ఆదేశాలననుసరించి కేంద్రం వీరికి కమిషన్‌లో స్థానం కల్పించింది. షార్ట్ సర్వీస్ కమిషన్ కింద సైన్యంలో 10 నుండి 14 ఏళ్లు మాత్రమే మహిళలు సేవలు అందిస్తున్నారు. ఆ తర్వాత పదవీ విరమణ పొందుతున్నారు. కానీ ఈ శాశ్వత కమిషన్ చోటు దక్కితే..సైన్యంతో తమ సేవలు కొనసాగించే అవకాశం లభిస్తుంది. మొత్తం 71 మంది షార్ట్ సర్వీస్ కమిషన్‌లో ఉండగా.. వీరంతా శాశ్వత కమిషన్‌లో చోటు కల్పించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వీరిలో 39 మంది శాశ్వత కమిషన్‌కు అర్హులు అని సుప్రీం కు కేంద్రం తెలిపింది.
ఏడుగురు వైద్యపరంగా అనర్హులని, 25 మంది క్షమశిక్షణా రాహిత్యంగా ఉన్నారని తెలిపింది. అయితే ఈ 25 మంది ఎందుకు శాశ్వత కమిషన్‌కు అర్హులు కారో.. వివరణాత్మకంగా తెలియజేయాలని కేంద్రాన్ని కోర్టు ఆదేశించింది. అక్టోబర్ 1 తీర్పులో ఏ ఒక్కరినీ సర్వీస్ నుండి తొలగించవద్దని జస్టిస్ డివై చంద్రచూద్, జస్టిస్ బివి నాగరత్ననేతృత్వంలోని ధర్మాసనం చెప్పింది.
