ఏజెన్సీ గజగజ.. అరకులో 3.8°C ఉష్ణోగ్రత

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సోమవారం అరకు లోయలో 3.8 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాది ఏజెన్సీ వ్యాప్తంగా సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవ్వడం ఇదే తొలిసారి.

జి మాడుగులలో 4.1 డిగ్రీలు, డుంబ్రిగూడలో 7.3 డిగ్రీలు, చింతపల్లి, ముంచంగిపుట్టులో 8.1డిగ్రీలు, హుకుంపేటలో 8.8 డిగ్రీలు, పెదబయలులో 9.0, అనంతగిరిలో 9. 4, కళింగపట్నంలో 13.2 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయ్యాయి. చలి తీవ్రతకు గిరిజనులు వణుకుతున్నారు. పగటి పూట కూడా వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి. లైట్లు వేయకపోతే.. 10 మీటర్ల దూరంలో ఉన్న మనిషి సైతం కనిపించడం లేదని వాహనదారులు చెప్తున్నారు. బుధవారం (డిసెంబర్ 18) నుంచి చలి స్వల్పంగా తగ్గే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.

ALSO READ | ఏపీలో రెండు రోజుల పాటు ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..