బీజేపీ ఎమ్మెల్యేలతో మిథున్ కీలక సమావేశం

బీజేపీ ఎమ్మెల్యేలతో మిథున్ కీలక సమావేశం

38 మంది TMC ఎమ్మెల్యేలతో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని బీజేపీ నేత, నటుడు మిథున్ చక్రవర్తి అన్నారు.  మీరు బ్రేకింగ్ న్యూస్ వినాలనుకుంటున్నారా?  టీఎంసీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలు తమకు డైరెక్ట్ గా టచ్ లో ఉన్నారంటూ వ్యాఖ్యలు  చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. కోల్ కతాలో బీజేపీ ఎమ్మెల్యేలతో మిథున్ చక్రవర్తి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మిథున్ ను ఉపయోగించుకుని.. బెంగాల్ లో పాగా వేయాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోందని విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. త్వరలో జరిగే పంచాయితీ ఎన్నికల్లో లబ్ది పొందాలని ఆ పార్టీ భావిస్తోంది. ఈ ఎన్నికలకంటే ముందుగానే కొన్ని కార్యక్రమాలను నిర్వహించాలని నేతలు నిర్ణయించారు. గత అసెంబ్లీ ఎన్నికల అనంతరం బెంగాల్ రాజకీయాలకు ఆయన పెద్దగా సమయం కేటాయించలేదు. ఇప్పుడు మళ్లీ యాక్టివ్ అయ్యారు.

బీజేపీ అధిష్టానంతో మిథున్ చక్రవర్తి భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీకి అండగా ఉంటానని మిథున్ హామీనిచ్చినట్లు సమాచారం. పార్థ ఛటర్జీ అంశంపై గురువారం కాలేజీ స్ట్రీట్ నుంచి ధర్మతల వరకు బీజేపీ ఊరేగింపు నిర్వహించనుంది. మరి ఈ ఊరేగింపులో ‘డిస్కో డ్యాన్సర్’ కనిపిస్తారా ? లేదా అనేది చూడాలి. వెస్ట్ బెంగాల్ లో ఉపాధ్యాయ రిక్రూట్ మెంట్ కుంభకోణం ప్రకంపనలు రేకేత్తిస్తోంది. ఆ రాష్ట్ర మాజీ విద్యాశాఖ మంత్రి పరిశ్రమల శాఖ మంత్రి పార్థ ఛటర్జీని ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. మంత్రి సన్నిహితురాలు అర్పితా ముఖర్జీని కూడా అదుపులోకి తీసుకుంది. ఈడీ అధికారులు జరిపిన దాడుల్లో ఇంటి నుంచి రూ. 21 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈడీ దాడుల నేపథ్యంలో ఇది ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది అంటూ బీజేపీ నేత సువేందు అధికారి ట్వీట్ చేశారు.