పిడుగు పడి 36 క్వింటాళ్ల మిర్చి దగ్ధం

కేటీదొడ్డి, వెలుగు : జోగులాంబ గద్వాల జిల్లా కేటీ దొడ్డి మండలంలోని పాగుంట గ్రామంలో సోమవారం తెల్లవారుజామున పిడుగు పడడంతో 36 క్వింటాళ్ల మిర్చి దగ్ధమైంది. గ్రామానికి చెందిన రైతు సిద్దప్ప తన పొలంలో మిరప సాగు చేయడంతో 36 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ప్రస్తుతం రేటు లేకపోవడంతో మిర్చిని పొలం వద్దే నిల్వ చేశాడు. సోమవారం తెల్లవారుజామున ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షంతో పాటు పిడుగు పడింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి మిర్చి మొత్తం ఖాళీ బూడిదైంది. సుమారు రూ. 9 లక్షల నష్టం వాటిల్లిందని బాధిత రైతు సిద్దప్ప ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన రైతును ఆదుకోవాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరారు.