ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 357 కరోనా కేసులు నమోదయ్యాయని తెలిపింది వైద్యారోగ్యశాఖ. కొత్తగా నమోదయిన కేసులతో కలిపి రాష్ట్రంలో 8,80,075కు కరోనా కేసులు చేరాయని.. 24 గంటల్లో కరోనాతో నలుగురు మృతి చెందారని చెప్పింది. దీంతో కరోనా మృతులు సంఖ్య 7,089కు చేరగా.. ప్రస్తుతం ఏపీలో 3,862 యాక్టివ్ కేసులున్నాయని తెలిపింది. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని పలు ఆసుపత్రుల నుంచి 8,69,124 మంది డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది. గడిచిన 24 గంటల్లో 59,551 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించామని.. ఇప్పటివరకు 1,14,74,797 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది ఏపీ వైద్యారోగ్యశాఖ.
