బిగ్‌‌‌‌ సీ రెండో లక్కీ డ్రాలో 35 మంది విజేతలు

బిగ్‌‌‌‌ సీ రెండో లక్కీ డ్రాలో 35 మంది విజేతలు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: స్మార్ట్‌‌‌‌ఫోన్ల రిటైల్ చెయిన్ బిగ్‌‌‌‌ సీ  20 వ వార్షికోత్సవం  సందర్భంగా ప్రకటించిన లక్కీ డ్రాకు మంచి స్పందన వస్తోంది. తాజాగా రెండో లక్కీ డ్రాను తీశారు. ఇందులో భాగంగా  7 మారుతి సుజుకీ ఆల్టోలు, 7 బజాజ్ ప్లాటినా బైక్‌‌‌‌లు, 7 రిఫ్రిజిరేటర్లు, 7 ఏసీలు, 7 టీవీలను బహుమతిగా మొత్తం 35 మంది విజేతలకు ప్రకటించారు. లక్కీ డ్రా ఆఫర్‌‌‌‌‌‌‌‌లో భాగంగా మూడు లక్కీ డ్రాలు తీస్తామని, గెలిచిన వారు 20 మారుతి సుజుకీ ఆల్టోలు,   20 బజాజ్ ప్లాటినా బైక్‌‌‌‌లు, 20 రిఫ్రిజిరేటర్లు, 20 ఏసీలు, 20 టీవీలను గెలుచుకునే వీలుంటుందని సంస్థ ఎండీ యం. బాలు చౌదరి పేర్కొన్నారు. ఈ ఆఫర్‌‌‌‌‌‌‌‌ ఈ నెల 29 వరకు కొనసాగుతుందని అన్నారు.  వీటికి అదనంగా బిగ్‌‌‌‌ సీలో  టీవీ లేదా మొబైల్ లేదా ల్యాప్‌‌‌‌టాప్ కొనుగోలు చేసిన వారికి రూ.4,000 విలువైన బహుమతిని, రూ.3000 వరకు ఇన్‌‌‌‌స్టంట్ డిస్కౌంట్‌‌‌‌ను  బిగ్‌‌‌‌ సీ ఆఫర్ చేస్తోంది. 

యాక్సెసరీ కొనుగోలుపై కూడా కంపెనీ బహుమతులు ఇస్తోంది.  బ్రాండెడ్ యాక్సెసరీలపై 51 శాతం వరకు డిస్కౌంట్‌‌‌‌ను, ఐఫోన్ 14 మొబైల్‌‌‌‌ కొనుగోలుపై రూ. 4 వేల వరకు క్యాష్ బ్యాక్‌‌‌‌ను, శామ్‌‌‌‌సంగ్ మొబైల్ కొన్న వారికి రూ.10 వేల వరకు క్యాష్ బ్యాక్‌‌‌‌ను ఆఫర్ చేస్తోంది. వివో మొబైల్ కొంటే  రూ.2,500 వరకు క్యాష్ బ్యాక్‌‌‌‌ను, ఒప్పో మొబైల్స్‌‌‌‌పై 10 శాతం వరకు క్యాష్ బ్యాక్‌‌‌‌ను, ఎంఐ మొబైల్స్‌‌‌‌పై రూ. 5 వేల వరకు క్యాష్ బ్యాక్‌‌‌‌ను ఇస్తోంది. రియల్‌‌‌‌మీ మొబైల్స్‌‌‌‌పై రూ. 3 వేల వరకు అందిస్తోంది.  బజాజ్ ఫైనాన్స్ ద్వారా కొనుగోలు జరిపితే రూ.6 వేల వరకు ఇన్‌‌‌‌స్టంట్ క్యాష్ బ్యాక్‌‌‌‌ను బిగ్‌‌‌‌ సీ ప్రకటించింది.