శ్రీకాకుళం: ప్రైవేటు బస్సు బోల్తా పడటంతో 35 మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన మంగళవారం ఉదయం మందస మండలం బాలిగాం దగ్గర జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు.. గాయపడ్డవారిని పలాస ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 48 మంది ప్రయాణికులు ఉన్నారని తెలిపిన పోలీసులు.. వారంతా వలసకూలీలుగా గుర్తించామన్నారు. బస్సు చెన్నై నుంచి కోల్ కతా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు పోలీసులు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఒక్క మర్డర్ దాచడం కోసం 9 హత్యలు చేశాడు
V6 ఛానెల్ చొరవతో బెంగళూరు నుండి స్వగ్రామానికి తల్లీకూతుళ్లు
నెటిజన్లు ఫిదా : బర్రె పగ తీర్చుకుంది.. ఆకతాయిల నడుం ఇరకొట్టింది

