కేరళలో వధువు కావాలంటూ షాపు ముందు బోర్డు 

 కేరళలో వధువు కావాలంటూ షాపు ముందు బోర్డు 

సాధారణంగా ఎక్కడైనా రోడ్డుపక్కన ఉండే షాపులో టూలెట్, జాబ్స్ వాంటెడ్ పోస్టర్లు కనిపిస్తుంటాయి. అదే వధువు కావలెను అనే బోర్డు ఉంటే.. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. కేరళకు చెందిన ఉన్నికృష్ణన్ అనే వ్యక్తి తన లైఫ్ పార్టనర్ కోసం ఓ బోర్డు పెట్టాడు. కులం, మతంతో సంబంధం లేదని రాశాడు. 33 ఏళ్ల ఉన్నికృష్ణన్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు దాటింది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా నుంచి అతడికి ఫోన్లు వస్తున్నాయి. ఉన్ని వివరాల్ని అడుగుతున్నారు.

ఉన్ని కృష్ణన్ రోజువారీ కూలీ. టీ స్టాల్ నడుపుతుంటాడు. తలలో చిన్న కణతి ఉండడంతో ఇన్నాళ్లు పెళ్లి చేసుకోలేదు. కొన్నాళ్ల క్రితం ఆపరేషన్ పూర్తయింది. ఇప్పుడు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. దీంతో పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. ఇంట్లో వాళ్లు, స్నేహితులు ఉన్నికృష్ణన్ కోసం కొన్ని సంబంధాలు చూశారు. కానీ.. అవి సెట్ కాలేదు. దీంతో ఇలా వధువు కావలెను అనే బోర్డు పెట్టాడు. అతడి ఫ్రెండ్ ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అవుతోంది.