33 ప్రభుత్వ పాఠశాలలకు శుక్రవారం వీక్ ఆఫ్

33 ప్రభుత్వ పాఠశాలలకు శుక్రవారం వీక్ ఆఫ్

జార్ఖండ్లో 33 ప్రభుత్వ పాఠశాలలకు శుక్రవారం వీక్లీ ఆఫ్ ప్రకటించారు. డుమ్కా జిల్లాలోని 33 ప్రభుత్వ స్కూళ్లలోని విద్యార్థులకు శుక్రవారం రోజున సెలవు ఇవ్వాలని ఆయా స్కూళ్ల ప్రిన్సిపల్స్ నిర్ణయించారు.   ఇప్పటికే వారంలో ప్రతీ ఆదివారం సెలవు ఇస్తుండగా..తాజాగా శుక్రవారం స్పెషల్ వీక్ ఆఫ్ ప్రకటించారు. అయితే విద్యాశాఖ అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా స్కూళ్ల  ప్రిన్సిపల్సే విద్యార్థులకు శుక్రవారం వీక్ ఆఫ్ ఇవ్వడం గమనార్హం. 

ఉర్దూ స్కూళ్లే..
ఈ 33 ప్రభుత్వ పాఠశాలల్లో శికరిపారా బ్లాక్లోని 10 స్కూళ్లు, రాణిశ్వర్ బ్లాక్లోని 8 స్కూళ్లు, సరియాయత్ బ్లాక్లోని 7 స్కూళ్లు.., జామా,  జార్ము్ండి బ్లాక్లలోని రెండేసి స్కూళ్లు, ఖాతీకుండ, డుమ్కా బ్లాక్ లోని ఒక్కో స్కూళ్లకు శుక్రవారం వీక్ ఆఫ్ ప్రకటించారు. వీటిల్లో ఎక్కువగా ఉర్దూ స్కూళ్లే ఉన్నాయి. 

అధికారింగా ఆదేశాలు ఇవ్వలేదు


ఈ 33 ప్రభుత్వ స్కూళ్లకు శుక్రవారం వీక్ ఆఫ్ ఇవ్వాల్సిందిగా తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. దీనిపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే 33 స్కూళ్ల ప్రిన్సిపల్స్కు  దీనిపై నోటీసులు పంపించామని డుమ్కా  జిల్లా ఎడ్యుకేషన్ సూపరింటెండెంట్ సంజయ్ కుమార్ దాస్ తెలిపారు. త్వరలో విచారణ చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

జార్ఖండ్లోని కొన్ని ముస్లీం ఆధిపత్య ప్రాంతాల్లో ఉర్దూ స్కూళ్లకు శుక్రవారం సెలవు ప్రకటించారని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగర్ణాత్ మాతో తెలిపారు. దీనిపై విచారణ చేయాల్సిందిగా జిల్లా విద్యాశాఖ అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామన్నారు. జామ్తారా జిల్లా విద్యాశాఖ అధికారి, జిల్లా టీచర్స్ సూపరింటెండెంట్ తో మీటింగ్ నిర్వహించిన ఆయన..వారంలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.