పాకిస్తాన్​​ జైళ్లలో 319 మంది భారతీయులు

పాకిస్తాన్​​ జైళ్లలో 319 మంది భారతీయులు
ఇస్లామాబాద్​, న్యూఢిల్లీ: తమ జైళ్లలో 319 మంది ఇండియన్లు ఖైదీలుగా ఉన్నారని, వీరి లో 49మంది సాధారణ పౌరులు, 270మంది జాలర్లు అని పాకిస్తాన్​ వెల్లడించింది. తమ దేశంలోనూ 340 మంది పాక్​ ఖైదీలు ఉన్నారని, వీరిలో 263 మంది సాధారణ పౌరులు, 77 మంది జాలర్లు అని మన దేశం ప్రకటించింది.  ఒప్పందాల ప్రకారం 2 దేశాలు ప్రతి ఆర్నెళ్లకు ఒకసారి ఖైదీల వివరాలను ప్రకటించాలి. కొన్నేళ్లుగా ఇండియా, పాక్​మధ్య గొడవలు జరుగుతున్నప్పటికీ, ఖైదీల లిస్టులను ప్రకటించడాన్ని మాత్రం ఆపలేదు. అణు స్థావరాల లిస్ట్ ఎక్స్చేంజ్ తమ దేశాల్లోని అణు స్థావరాల జాబితాను ఇండియా, పాకిస్తాన్ ఎక్స్చేంజ్ చేసుకున్నాయి. అణు స్థావరాలపై దాడులు చేయకుండా ఉండేందుకు 1988 డిసెంబర్ 31న జరిగిన ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా ఇండియా, పాకిస్తాన్ లు ఏటా జనవరి 1న ఈ సమాచారాన్ని షేర్ చేసుకుంటాయి.