మెక్సిలో నివసిస్తున్న భారత్‌కు చెందిన 311 మంది అక్రమ వలసదారులను ఆ దేశం తిరిగి భారత్‌కు పంపించేసింది. అమెరికానుంచి ఎదురవుతున్న ఒత్తిళ్ల కారణంగా వివిధ ప్రాంతాల్లో సరిహద్దులు దాటి తమ దేశంలోకి ప్రవేశిస్తున్న వారిని అరికట్టే క్రమంలో మెక్సికో ఇమ్మిగ్రేషన్ అధికారులు చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా భారత్‌కు చెందిన 311 మందిని తిరిగి స్వదేశానికి పంపించేశారు. వారిలో ఒక మహిళ కూడా ఉంది. టొలుకా నగరంలోని అంతర్జాతీయ విమానాశ్రయంనుంచి వారిని ఢిల్లీకి పంపించివేసినట్లు నేషనల్ మైగ్రేషన్ ఇన్‌స్టిట్యూట్ తెలిపింది.
స్వదేశీయులకే ఉపాధి అవకాశాలు అని, ఎన్నారైలలో అత్యంత ప్రతిభావంతులకే అవకాశం అంటూ చెబుతున్న ట్రంప్ తన విదేశీవిధానంలో మార్పు చేయడం లేదు. దీంతో ఎలాగైనా అమెరికాలో నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలనే కొందని ఆశను ఏజెంట్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఇందులో భాగంగా..అక్రమంగా అమెరికాలోకి ప్రవేశిస్తున్నారని ఇండియన్లను వెనక్కి పంపిన మెక్సికో ప్రభుత్వం. అంతార్జాతీయ ఎజెంట్ల ద్వారా భారతీయులు అక్రమంగా అమెరికా వెళ్లటానికి ప్రయత్నిస్తున్నారు. ఇందుకు గాను ఒక్కొక్కరూ 25 నుంచి 30 లక్షలు చెల్లిస్తున్నారు.

